రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.
ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100కుపైగా కార్మికులు ఉండగా.. ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. కొందరు భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. కంపెనీలో చిక్కుకున్న సిబ్బంది భయపడి ప్రాణాలు రక్షించుకోవడానికి కిటికీల ద్వారా బయటికి దూకారు. షాద్ నగర్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం...మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు.
Here's Videos
ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మ కంపెనీలో చెలరేగిన మంటలు.
కంపెనీలో చిక్కుకున్న సిబ్బంది భయపడి ప్రాణాలు రక్షించుకోవడానికి కిటికీల ద్వారా బయటికి… pic.twitter.com/y3hUkHIkWa
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2024
ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.