Telangana: కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఒకే కుటుబంలో నలుగురు చిన్నారులు మృతి, తెలంగాణలోని గద్వాల జిల్లాలో విషాదకర ఘటన
తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. మృతి చెందినవారిని అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని గుర్తించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. మృతి చెందినవారిని అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని గుర్తించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటన స్థలి వద్ద ఆర్తరోదనలు మిన్నంటుతున్నాయి. ఆలంపూర్ నియోజవకర్గంలో కృష్ణా నదిని చూసేందుకు 11 మంది ఆటోలో వెళ్లారు. నదిలో దిగిన చిన్నారులకు ఈత రాకపోవడంతో నీట మునిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.
News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)