Telangana: వీడియో ఇదిగో, భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త , అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరింపులు, చివరకి ఏమైందంటే..
భార్య కాపురానికి రావడం లేదని హెవీ విద్యుత్ లైన్ పోల్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భార్య రాకుంటే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు.
జగిత్యాల - ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ వృత్తి రీత్యా పెయింటర్. భార్య కాపురానికి రావడం లేదని హెవీ విద్యుత్ లైన్ పోల్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భార్య రాకుంటే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు.ధర్మపురి పోలీసులు జోక్యం చేసుకొని భార్యను పిలిపించి మాట్లాడుతామని హమీ ఇవ్వగా శాంతించిన భర్త టవర్ పై నుంచి దిగిరాగా ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా వివాదం సర్దుమనింది వీడియో ఇదిగో..
మేకల ప్రభాకర్ లావణ్య దంపతుల మధ్య నెలకొన్న కుటుంబ కలహాల నేపద్యంలో కొంత కాలంగా భర్తకు దూరంగా భార్య తల్లిగారి ఇంటి వద్దనే పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ ప్రభాకర్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో ధర్మపురి సీఐ రమణమూర్తి జోక్యం చేసుకొని ప్రభాకర్ భార్యను ఇక్కడికి రప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటంతో అతను శాంతించి టవర్ పై నుంచి కిందకు దిగాడు. అనంతరం భార్య భర్త లిద్దరినీ పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని పెద్దమనుషుల సమక్షంలో సీఐ రమణ మూర్తి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో భార్యాభర్తల వివాదం సద్దుమనిగింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)