Bapatla, AUG 03: మతిస్థిమితం లేని బాలుడు చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్‌పైకి ఎక్కిన బాలుడికి పైన విద్యుత్ లైన్లతో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో 15 నిమిషాల పాటు రైల్వే పోలీసులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వివరాలకు వెళ్తే .. గూడురు (Gudur)నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు(express train ) శనివారం బాపట్ల రైల్వే స్టేషన్ (Bapatla Railway Station ) కు చేరుకుంది. అప్పటికే ప్లాట్‌ఫాం వద్ద ఉన్న మతిస్థిమితం లేని బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజిన్‌పైకి ఎక్కాడు. విద్యుత్ లైన్లు తగిలి ప్రమాదం జరుగవచ్చన భయంతో రైలు సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
Drunk And Drive: మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్.. ఆటో మీద పడి వ్యక్తి మృతి, దేహశుద్ది చేసిన స్థానికులు
అనంతరం 15 నిమిషాల పాటు బాలుడిని రైల్వే పోలీసులు బతిమిలాడి, చివరకు బలవంతంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బాలుడు కోల్‌కత్తాకు చెందిన వాడిగా గుర్తించామని, ఆ బాలుడికి మతిస్థిమితంలేదని పోలీసులు తెలిపారు. బాలుడి చర్య వల్ల రైలు దాదాపు 30 నిమిషాల పాటు స్టేషన్‌లోనే నిలిచిపోయింది.