Woman Climbs Light Tower (PIC@ ANI X)

Hyderabad, NOV 11: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన ఎస్సీ ఉప కులాల విశ్వరూప (SC Vishvaroopa Maha Sabha) మహాసభలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ (Modi) ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువతి.. తీవ్ర భావోద్వేగానికి గురై సభా ప్రాంగణంలో ఉన్న ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఎక్కారు. ఇది గమనించిన మోదీ.. ‘‘తల్లీ కిందకు దిగాలి. ఇది మంచిది కాదు. నేను మీతో ఉన్నాను. నేను నీ మాట వింటాను. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను. మీరు మందకృష్ణ మాట వినాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

 

ప్రధాని పలుమార్లు సూచించడంతో యువతి స్తంభంపై నుంచి కిందకు దిగింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మోదీ తన ప్రసంగం కొనసాగించారు. అయితే స్తంభం ఎక్కిన యువతి అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. మోదీ ప్రసంగిస్తుండగా యువతి స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వేదికపై ఉన్నవారితో పాటు సభకు వచ్చిన జనానికి చెమలు పట్టాయి. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నీవు చెప్పేది వింటాను, కిందకు దిగాలంటూ ఆ యువతిని వారించారు మోదీ. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను కిందకు దించారు.