World’s Tallest Bamboo Tower (Credits: X)

Newdelhi, Oct 21: ఐరోపాలోని ఫ్రాన్స్‌ (France) లో ఉన్న ఈఫిల్‌ టవర్‌ చూశారా? ఇనుముతో చేసిన ఈ ఎత్తైన కట్టడాన్ని చూడటానికి ఏటా కోట్లాది మంది పర్యాటకులు క్యూ కడతారు. ఆ ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన మరో నిర్మాణాన్ని మన దేశంలోనూ చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్‌ (World’s Tallest Bamboo Tower) ను ఛత్తీస్‌ గఢ్‌ లో నిర్మించారు మరి. ఈ నిర్మాణం రాయ్‌ పూర్‌ కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది. పర్యాటక ఆకర్షణగా నిలిచిన ఈ టవర్‌ ను కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. ఈ టవర్ ను వాచ్‌ టవర్‌, టెలికామ్‌ టవర్‌, ప్రసార టవర్‌, రేడియో టవర్‌ గా ఉపయోగించుకొనేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉందని నిర్మాణ సంస్థ చెప్పింది.

జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత

--టవర్ విశేషాలు ఇవిగో..--

  • వ్యయం-రూ.11 లక్షలు
  • ఎత్తు-140 అడుగులు
  • ఉపయోగించిన వెదురు-7400 కిలోలు
  • నిర్మాణ సంస్థ-భవ్య సృష్టి అనే స్టార్టప్‌
  • టవర్ జీవిత కాలం-25 ఏండ్లు

గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో