COVID in TS: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, తెలంగాణలో ఒక్కరోజే 1,520 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు

తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరుకుంది.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,85,543కి చేరుకుంది. ఇదే సమయంలో ఒకరు మృతి చెందగా... 209 మంది కోలుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మృతుల సంఖ్య 4,034కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 6,75,341 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 9.51 శాతంగా ఉంది. మరో 7,039 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు గత 24 గంటల్లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన 247 మందికి ఈరోజు ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now