Covid in TS: తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా, 21 మంది మృత్యువాత, జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Coronavirus in US (Photo Credits: PTI)

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 1,00,677 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 36,917 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. తాజాగా 3,837 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... రాష్ట్రంలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు సైతం జాతీయ సగటు (1.2శాతం)తో పోలిస్తే రాష్ట్రం మిన్నగా ఉందని (0.56శాతం) పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now