Telangana: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ, చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు మంత్రి కాన్వాయ్ పై విసిరిన ఆందోళనకారులు, రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్డి సింహగర్జన సభకు మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్డి సింహగర్జన సభకు మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. దాంతో పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో నినాదాలు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)