TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయనే వార్తలు ఫేక్, తప్పుడు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టీజీఎస్ఆర్టీసీ
హైవేలపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టిక్కెట్‌లోని టోల్ సెస్‌ను సవరించామని పేర్కొంది. దీంతో సాధారణ ఛార్జీలు యథాతథంగా ఉన్నట్లు పేర్కొంది.
ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ బుధవారం స్పష్టం చేసింది. హైవేలపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టిక్కెట్‌లోని టోల్ సెస్‌ను సవరించామని పేర్కొంది. దీంతో సాధారణ ఛార్జీలు యథాతథంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి
సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. సాధారణ రూట్లలో టిక్కెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్సు ఛార్జీలను పెంచిందంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Here's Sajjanar Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)