Telangana: దారుణం, వృద్ధుడి భూమిని డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ, పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా
టేకుమట్ల - ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు.
టేకుమట్ల - ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు.ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వీడియో ఇదిగో, మున్సిపల్ అధికారులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకు వచ్చారు కానీ, ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు ముట్టచెప్తానని వెళ్లిపోయారు.మళ్లీ డబ్బులు ఇయ్యమని ఇంటికి పోతే మొదట ఇస్తా అన్నడు.. తర్వాత ఇవ్వనుపో అన్నడు. పోలీసులు, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో.. బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా. ఆయనకి మద్దతు తెలిపిన టేకుమట్ల మండల రైతులు, ప్రజలు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)