KCR Slams Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైంది, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపిన బీఆర్ఎస్ అధినేత
బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే
కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ తెలంగాణసమాజాం కోరుకుంటోంది. కేసీఆర్ మీద ద్వేషంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది’అని కేసీఆర్ అన్నారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని సూచించారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతానని, చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే వారితో మనస్ఫూర్తిగా మాట్లాడతానని తెలిపారు. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో తనను కలిసిన మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)