Telangana: వీడియో ఇదిగో, నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని ఏడ్చిన బాలుడు, ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన పోలీసులు, మెచ్చుకుంటున్న నెటిజన్లు
నాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది.
నాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుండి తొమ్మిదవ తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం జరుగుతున్న అర్హత పరీక్ష నిర్వహిస్తున్న వేళ పలివేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు తండ్రితో వచ్చిన ఓ విద్యార్ధి నేను లోపలికి పోను నాకు భయం వేస్తోందని మారం చేశాడు.
బాలుడిని అప్పడే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, అక్కడే విధులు నిర్వహిస్తున్న కేయుసి ఇన్స్ స్పెక్టర్ రవికుమార్ ఆ విద్యార్థిని బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. సదరు విద్యార్థిని పరీక్ష రాసేందుకు పోలీసులు చూపిన చోరవ పరీక్షా కేంద్రం వద్ద వున్న విద్యార్థుల తల్లిదండ్రుల మనస్సుల్లో పోలీసులపై గౌరవం మరింత పెరిగింది..
నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని ఏడ్చిన బాలుడు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)