V. Hanumantha Rao: నాకేమి తక్కువైందని పక్కనబెట్టారు, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని... ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు.

VH Hanumantha Rao (photo-Video Grab)

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని... ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు. పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇండియాలో తనకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా? అని అడిగారు.కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీసీలకు సీట్లు ఇవ్వాలి.. కొత్త లీడర్లకు టికెట్లు ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఎం అవ్వాలని అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now