Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, టికెట్ రాకపోవడంతో జిట్టా బాలకృష్ణ రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు
ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవలే ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవలే ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యే టికెట్లను ఆశించారు. ఇదే హామీపై వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రినింగ్ కమిటీ సంచలన ప్రకటన చేసింది.
119 సీట్లకు గాను 55 సీట్లకు సంబంధించి అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వెల్లడించింది. ఈ లిస్టులో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 20 మంది నేతలకు టికెట్లు దక్కాయి. ఇందులో 17 మంది రెడ్లకు దక్కడం విశేషం. ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణా రెడ్డికి మంచి పేరుంది. ఈ తరుణంలో తను కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)