Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్
తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…
తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు… పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి కారు కొట్టుకుపోయింది.. అయితే.. తమ కారు వాగులోకి పోయిందని, తమ మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని ఫొన్ చేశారు.ప్రస్తుతం వారి ఫోన్ లు స్విచ్చాఫ్ రావడం, కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కాలువలో కొట్టుకొచ్చిన రెండు కార్లు, ఓ కారులో కోదాడ వాసి మృతి
Here's News