Telangana Rains: భారీ వరదలకు ఇల్లు కూలి తల్లికూతురు మృతి, రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి ఇల్లు
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.
తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) వెల్లడించింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 299.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 298.0మి.మీ, సూర్యాపేట జిల్లా చిలుకూరులో 297.8మి.మీ వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)