Telangana Rains: వీడియో ఇదిగో, దుంధుభి నదిలో చిక్కుకున్న 10 మంది చెంచులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ
దుంధుభి నదిలో (Dindi Vagu) చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు గత నెల 31న చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్ వద్ద దుంధుభి వాగులో వారు చిక్కుకుపోయారు
దుంధుభి నదిలో (Dindi Vagu) చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు గత నెల 31న చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్ వద్ద దుంధుభి వాగులో వారు చిక్కుకుపోయారు. తాము వాగులో చిక్కుకుపోయినట్లు గ్రామస్థులకు సోమవారం సమాచారం అందించారు. దీంతో నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు.. డ్రోన్ కెమెరాల సహాయంతో వారున్న ప్రదేశాన్ని గుర్తించారు.
బాధితులకు ఆహార పదార్థాలను అందించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు. మంగళవారం ఉదయం నాగర్‌కర్నూల్ పోలీసుల సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సహాయకచర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. కాగా, చెంచులను రక్షించిన పోలీసులను డీజీపీ జితేందర్ అభినందించారు. తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)