Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన వట్టెం పంప్ హౌస్, టన్నెల్ మీదుగా పంపుహౌస్‌లోకి వెళ్లిన చెరువుల వరద నీరు
ప్యాకేజీ-7లోని ఆడిట్ నుంచి పంప్‌హౌస్ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్‌కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది
నాగర్‌కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్‌హౌస్ (Vattem Pump House) నీటమునిగింది. ప్యాకేజీ-7లోని ఆడిట్ నుంచి పంప్‌హౌస్ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్‌కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది.వట్టెం పంపింగ్ స్టేషన్‌లో మొత్తం 10 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు నాలుగు బిగించారు. మరో మోటారు నిర్మాణ దశలో ఉన్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని గొలుసుకట్టు చెరువులు భారీ వరదతో పొంగిపొర్లాయి. తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తూడికుర్తి, శ్రీపురం, నాగనూలు చెరువులు నిండి అలుగు పారాయి. ఈ చెరువుల సమీపంలో పీఆర్‌ఎల్‌ఐ పథకం టన్నెల్ ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన మార్గం మీదుగా ఈ చెరువుల వరద నీరు సర్జిపూల్‌లోకి వచ్చి గేట్ల ద్వారా పంపుహౌస్‌లోకి వెళ్లింది. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో (PRLI) మరో ఘటన చోటుచేసుకున్నది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పీఆర్‌ఎల్‌ఐ పథకంలో భాగంగా దీన్ని నిర్మించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)