Telangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు దాటుతూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోకి రాగానే గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు ఒక్కసారిగా రోడ్డు దాటే క్రమంలో బస్సును ఢీ కొట్టింది.

car that collided with an RTC bus while crossing the road in Pragnapur Rajiv Road in Siddipet district Five people were injured Watch Video

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోకి రాగానే గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు ఒక్కసారిగా రోడ్డు దాటే క్రమంలో బస్సును ఢీ కొట్టింది.

మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తంఅంబులెన్స్‌లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకొనే సమయంలో శ్రావణి అనే మహిళ (38) మృతి చెందగా మరో నలుగురు క్షతగాత్రులను సుధాకర్ (40), గణేష్ (35), సాయి(28), లతిక్(12), లకు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.సికింద్రాబాద్ లోని దమ్మాయిగూడ నుంచి తమ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి గ్రామానికి వెల్లే క్రమంలో ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గజ్వేల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 Car Collided with RTC bus while crossing the road

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now