Telangana Road Accident: పెళ్లి కూతురును తీసుకువస్తుండగా ట్రాక్టర్ బోల్తా, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి, మెదక్ జిల్లాలో విషాదకర ఘటన
మెదక్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు ఆందోల్ గ్రామానికి బయల్దేరారు. మన్సాన్‌పల్లి వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
మెదక్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు ఆందోల్ గ్రామానికి బయల్దేరారు. మన్సాన్‌పల్లి వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బూదెమ్మ(48), సంగమ్మ(45) అనే మహిళలు మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంట్లో గొడవపడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, ప్రాణాలకు తెగించి కాపాడిన హోంగార్డు, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)