Telangana Local Body Elections: తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు

తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ, అలాగే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది.

Telangana High Court (X)

తెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ, అలాగే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది.తెలంగాణ హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, నవంబర్‌ 11 వ తేదీన ఉప ఎన్నిక, 14వ తేదీన కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు విడుదల

Here's SEC Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement