Student Dies by Suicide: హన్మకొండ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని అనుమానాలు

బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో సూసైడ్‌ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది. దీప్తి తన క్లాస్‌మేట్‌ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు.

Second-year Agriculture Student Dies by Suicide in Hostel Room in Hanumakonda

హన్మకొండ జిల్లాలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో సూసైడ్‌ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది. దీప్తి తన క్లాస్‌మేట్‌ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు. కాగా, ఇటీవలే వీరి మధ్య గొడవలు కావడం, ఇటీవల వచ్చిన పరీక్ష ఫలితాల్లో ఒక్క సబ్జెక్ట్‌లోనే పాస్‌ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీప్తి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)