Video: వీడియో ఇదిగో, స్కూలును మందు బారుగా మార్చేసిన 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుడిని ఇరికించే ప్రయత్చం చేసి అడ్డంగా దొరికిన స్టూడెంట్స్
ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన
స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టి టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన. తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మల్లంపల్లిలోని ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఏకంగా స్కూలుకే తీసుకొచ్చి తాగారు. చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించి మరోసారి ఇలాంటి పనులు చేయబోమని వారితో రాయించుకున్నారు.
మరుసటి రోజు విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడే మద్యం తాగి తమతో ఒప్పంద పత్రం రాయించుకున్నట్టు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోపంతో హాస్టల్‌కు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. వారి ఫిర్యాదు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణస్వామి పాఠశాలకు వెళ్లి విచారించగా విద్యార్థులే మద్యం తాగినట్టు వెల్లడైంది.ఏడుగురు తొమ్మిదో తరగతి, ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మద్యం తాగినట్టు తేల్చారు. వీరిలో ఎక్కువమంది ఏటూరునాగారం మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)