Telangana Shocker: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య, రూ. 10 వేలు ఇవ్వలేదని జనం చూస్తుండగానే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Here's IANS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)