Telangana Shocker: వీడియో ఇదిగో, సినిమాకి వెళ్లడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
కొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడగగా తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్ళిపోయారు. అయితే తండ్రి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో కార్తీక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈదమ్మ గుడి కాలనీకి చెందిన మైనర్ బాలుడు కార్తీక్ తండ్రి గణేష్ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తుంటాడు తల్లి సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులు గుడికి వెళుతున్న క్రమంలో కొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడగగా తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్ళిపోయారు. అయితే తండ్రి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో కార్తీక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చేసిన పని తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నారు.
సినిమాకి వెళ్లడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)