Boy Attacked by Stray Dogs: వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి..

ఆరు కుక్కలు అకస్మాత్తుగా బాలుడిపై దాడి చేయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం అయింది.

Stray dogs attacked a boy playing outside house in Sangareddy

సంగారెడ్డిలోని శ్రీనగర్‌ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి చేసి బీభత్సం సృష్టించింది. ఆరు కుక్కలు అకస్మాత్తుగా బాలుడిపై దాడి చేయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం అయింది. సహాయం కోసం బాలుడి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమికొట్టారు.బాలుడికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా వీధికుక్కల వల్ల చిన్నారులు చనిపోవడం, కుక్కకాటు కారణంగా వృద్ధులు గాయపడడం వంటి ఘటనలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 29న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీహార్‌కు చెందిన వలస దంపతుల కుమారుడు ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌లతో కూడిన హైకోర్టు డివిజన్‌ ​​బెంచ్‌ సుమోటోగా విచారణ చేపట్టింది.  సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి, తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తిన బాలిక

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)