Sirnapalli Waterfalls: ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే.. తెలంగాణలో నయాగరా జలపాతాన్ని తలపిస్తున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్స్
తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి జలపాతం ఈ వర్షాల దెబ్బకి హోయలు పోతోంది. జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అని పిలిచే ఈ జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి జలపాతం ఈ వర్షాల దెబ్బకి హోయలు పోతోంది. జానకి బాయి జలపాతం లేదా తెలంగాణ నయాగరా జలపాతం అని పిలిచే ఈ జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాదు జిల్లా లోని ధరపల్లి మండలం లోని సిర్నాపల్లి గ్రామంలో ఈ జలపాతం కలదు. స్వాతంత్ర్యానికి పూర్ర్వం సిర్నాపల్లి సంస్థానానికి చెందిన సిర్నాపల్లి రాణి లేదా "సీలం జానకి బాయి" అనేక వేల ఎకరాల బూమి కలిగిన భూస్వామి. సీలం జానకీ బాయి ఆ రోజుల్లో ఒక తటాకాన్ని నిర్మించారు. ఆ సరస్సు నుండి ప్రవహించే నీరు రామడుగు ప్రాజెక్టు కు ప్రవహిస్తుంది.
ఆమె తన సంస్థానంలో వ్యవసాయాభివృద్ధి కోసం అనేక సరస్సులు నిర్మించి ప్రజలకందించారు. ఆమె మంచిప్ప చెరువు ను కూడా నిర్మించారు. ఈ చెరువు నీరు నిజామాబాదు జిల్లా ప్రజల త్రాగు నీటి అవసరాలు తీర్చుటకు ఉపయోగపడేది. శీలం/శీలం రాజా రామలింగ రెడ్డి, రాణి జానకీ బాయి లు సిర్నాపల్లి గ్రామంలో భూస్వాములు. వారి కుమారుడు శీలం రాం భూపాల్ రెడ్డి పదవీవిరమణ చేసిన ఐ.పి.ఎస్ అధికారి. జానకీబాయి యొక్క మునిమనుమడి అనురాధారెడ్డి. ఆమె హైదరాబాదు లో INTACH(ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ కల్చురల్ అండ్ హెరిటేజ్) కు కన్వీనరుగా యున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)