
Hyd, Feb 22: పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు… దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించారు . పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత... పసుపు బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు(Turmeric Board) దిగుమతులు తగ్గుతాయి అన్నారు. దాని వల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుంది,వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారు.. నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదు, ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఎంత మంచి నాణ్యతగల పసుపుకు అయినా మంచి ధర ఇవ్వడం లేదు అన్నారు.
పసుపుకు 12 వేల కనీస ధర కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. తక్షణమే పసుపుకు(Turmeric Bonus) బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం… పసుపు బోర్డుకు చట్టబద్ధతు, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ధీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనన్నారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది… మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను దిగ్భందిస్తాం అన్నారు.
ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారు… చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత… ఆయన ప్రకటన చేశారు అన్నారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను తరలించడానికి ఏపీ ప్రాజెక్టు చేపడుతున్నారు…మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారు అన్నారు. బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది..కాబట్టి వాళ్లిద్దరు ఎలా చెబితే సీఎం రేవంత్ రెడ్డి అలా నడుచుకుంటున్నారు అన్నారు.
నిజంగా తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు.. ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదు ?,ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు..తెలంగాణ రైతుల కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ చంద్రబాబుపై ఉందా ? అన్నారు.
చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ?,రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ?,తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలి… నోరుందికదా అని సీఎం రేవంత్ రెడ్డి గంప గయ్యాళిలా ఒర్రుతున్నారు.. కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు.