Raids in Nizamabad (Credits: X)

Nizamabad, Oct 20: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు (Food Quality) తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లహరి హోటల్ లో 122 కిలోల కుళ్లిన మాంసం ఉత్పత్తులు, ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్ ను అధికారులు గుర్తించారు. బూజు పట్టిన కూరగాయలు, ఫంగస్ చేరిన మిర్చి మసాల పెస్ట్ ల నిల్వలు కూడా లభించాయి.

ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వ‌ద్ద పేలుడు.. పోలీసులు అప్ర‌మ‌త్తం (వీడియోతో)

Here's Video:

మరో హోటల్ లో..

ఇక వంశీ హోటల్ లో రూ. 24 వేల విలువ చేసే హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు హోటల్స్ కు నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటం అడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి