Newdelhi, Oct 20: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీలోని సీర్పీఎఫ్ స్కూల్ (CRPF School) సమీపంలో ఆదివారం ఉదయం 7.50 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Here's Video:
సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడు
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల పేలుడు సంభవించింది. ఉదయం 7:50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/lqzdpPoD3H
— ChotaNews (@ChotaNewsTelugu) October 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)