Telangana Stadium Wall Collapse Video: తెలంగాణలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం, ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు

మొయినాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడినట్లు అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు

Telangana Stadium Collapse. (Photo Credit: X Video grab )

మొయినాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడినట్లు అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజేందర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. ఒక మృతదేహాన్ని వెలికి తీయగా, శిథిలాల కింద ఉన్న మరో మృతదేహాన్ని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement