Telangana: మల్లారెడ్డి కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత, 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో ధర్నాకు దిగిన విద్యార్థులు, కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం

మేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Students staged protests and burnt the effigy of BRS MLA MallaReddy, at the School of Agricultural Sciences

మేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయం లో నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను కాలేజీ నుంచి డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.

గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.మల్లారెడ్డి కాలేజీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సపోర్ట్ చేశారు. కళాశాల వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now