Telangana: వీడియో ఇదిగో, గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి కిరీటం, శఠగోపం ఎత్తుకెళ్లిన దొంగలు, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో ఘటన
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఆలయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దొంగలు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ అటు పోలీసులకు, ఇటు సామాన్య ప్రజలు, వీధి వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పోలీసుల పాట్రోలింగ్ లేక దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఆలయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని భైంసా ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
ఇక గతంలో జరిగిన మరో ఘటనలో భక్తుడిలా వచ్చిన ఓ వ్యక్తి ఆలయంలో కిరీటాన్ని దొంగిలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ జిల్లాలో ఓ దొంగ గుడిలో కూర్చుని 15 నిమిషాల పాటు పూజలు చేసి హనుమంతుడి వెండి కిరీటాన్ని అపహరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Thief steals Goddess' crown from temple