TS Traffic Challan Discount Offer Ends: ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. మొత్తం 1.67 కోట్ల చలాన్ల ద్వారా రూ.150.3 కోట్లు వసూలు
గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Hyderabad, Feb 16: ట్రాఫిక్ చలాన్లపై (Traffic Challan) ప్రభుత్వం ఇచ్చిన రాయితీ (Discount) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ అయ్యాయి. కాగా, గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన చలాన్ల రాయితీ గడువును ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు పొడిగించడం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)