Telangana: వైరల్ వీడియో, కేసీఆర్ పీఎం కావాలని కోళ్లు, మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి, దసరాకు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.దసరా రోజున కేసీఆర్ (KCR) జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా.. కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు, దేశానికి ప్రధాని అవ్వాలని కోరుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు కోళ్లు, మద్యం పంపిణీ చేశారు. ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే.. వార్తల్లో నిలవడానికే ఇలాంటి కార్యక్రమం చేశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)