Telangana: వైరల్ వీడియో, బూతు తిడుతూ జిల్లా స్థాయి అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అప్పుడే ఓ బూతు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Screengrab of video (Photo Credit- YouTube)

జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అప్పుడే ఓ బూతు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. తనతో కాకుండా జడ్పీ ఛైర్మన్‌తో ఆ స్కూలును ప్రారంభం చేయించడం ఈ ఘటనకు కారణం అయింది. ఎమ్మెల్యే రావడం ఆలస్యం అయిందని నిర్వహకులు జడ్పీ ఛైర్మన్ తో స్కూలు ప్రారంభం చేశారు. ఆగ్రహం పట్టలేకపోయిన ఎమ్మెల్యే వెనకే ఉన్న విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకుని వెనక్కి తోసేశారు.[Poll ID="7784" title="సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?"]

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement