Telangana: వీడియో ఇదిగో, నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో పో, బస్సులో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగన మహిళ ప్రయాణికురాలు

నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో. బస్సులో కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది.

Woman passenger fight with conductor in TGSRTC Bus (Photo-Video Grab)

నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో. బస్సులో కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది. అయితే బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది. అడ్డంగా లగేజీ పెట్టడంతో కండక్టర్ డీఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు. బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ మహిళ నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో అంటూ మండిపడింది.

హైదరాబాద్ లోని హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్‌ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు మృతి (వీడియో)

Woman passenger fight with conductor in TGSRTC Bus

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement