Fake Female Police Officer Arrested: ఏడాది పాటు నకిలీ ఐడీ కార్డుతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐగా చెలామణి, చివరకు పెళ్లి చూపులకు యూనిఫారంతో వెళ్లి బుక్కయిన యువతి, అబ్బాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కటకటాల్లోకి..

ఏడాది కాలంగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది.

Woman pretending to be RPF sub-inspector held in Telangana

ఏడాది కాలంగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది.

ఊరిలో తన పరువు పోతుందని ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థులను సంతృప్తి పరచడానికి పోలీసు అధికారిగా ప్రజల్లో చలామణి కావాలని నిర్ణయించుకుని ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ అవతారమెత్తింది. విధులకు వెళ్తున్నట్టు దాదాపు ఏడాది పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించింది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లింది.అయితే అబ్బాయి తరఫున బంధువులు పై అధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది. పోలీసులుకు సమాచారం ఇవ్వండంతో అర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఎస్పీ తెలిపారు.  దారుణం, హస్త ప్రయోగం చేసుకుని ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో పెట్టి అమ్ముతున్న వ్యాపారి, వైరల్ వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement