TS Youth Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత.. మృతుడిని ఖమ్మం జిల్లా వాసి సాయిరాజీవ్ రెడ్డిగా గుర్తింపు
అమెరికాలోని టెక్సాస్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో సాయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Khammam, Jan 9: అమెరికాలోని (America) టెక్సాస్ (Texas) లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఖమ్మం జిల్లాకు (Khammam) చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో సాయి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని హాస్పిటల్ కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గత కొంతకాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయినట్టు తెలుస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement