YS Sharmila: పొలంలో దిగి నాట్లు వేసిన వైఎస్ షర్మిల, మహిళలు లేనిదే ఎవుసం లేదని వెల్లడి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల.. కొడంగల్ లో జరిగిన పాద యాత్రలో పొలంలో దిగి నాటు వేసింది. మహిళా రైతులతో కలిసి.. నాటు వేసింది షర్మిల. ఇక షర్మిల నాటు వేస్తుంటే.. తెలంగాణకు షర్మిల సీఎం కావాలని ఆమె అనుచరలు గానం అందుకున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల.. కొడంగల్ లో జరిగిన పాద యాత్రలో పొలంలో దిగి నాటు వేసింది. మహిళా రైతులతో కలిసి.. నాటు వేసింది షర్మిల. ఇక షర్మిల నాటు వేస్తుంటే.. తెలంగాణకు షర్మిల సీఎం కావాలని ఆమె అనుచరలు గానం అందుకున్నారు.వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మహిళలు లేనిదే ఎవుసం లేదు. వారి కష్టం వెలకట్టలేనిది. నాటు వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు సగం పనులు వారివే. ఎవుసమైనా, ఇల్లు అయినా, దేశాన్ని అయినా నడిపించడంలో వారికి వారే సాటి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగు పడుతాయనుకుంటే.. బతుకే లేకుండా చేసి, ప్రతి ఒక్కరిపై రెండు లక్షల అప్పు పెట్టిండు. ప్రజల తరఫున ప్రశ్నిస్తారని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. భూకబ్జాలు,సెటిల్ మెంట్లతో దందాలకు తెరలేపి,అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.YSR సంక్షేమ పాలనతోనే ప్రజలకు మేలు అని పేర్కొన్నారు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)