Kokapet Real Estate: తెలుగు రాష్ట్రాల చరిత్రలో రికార్డ్... కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2500 కోట్లకు పైగా ఆదాయం?!
హైదరాబాద్ లోని కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది.
Hyderabad, Aug 4: తెలుగు రాష్ట్రాల (Telugu States) రియల్ ఎస్టేట్ (Real Estate) చరిత్రలో ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. హైదరాబాద్ లోని (Hyderabad) కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది. ఇక్కడి నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో ప్లాట్ నెంబర్ 10లో ఎకరా భూమి ధర ఏకంగా రూ.100.25 కోట్లు పలికింది. ఈ భూమిని కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీగా తెలుస్తోంది. హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. నియో పోలిస్ ఫేజ్ 2లోని నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1,532.20 కోట్ల ఆదాయం సమకూరింది. 45 ఎకరాలలో వున్న 7 ప్లాట్లకు ప్రభుత్వం రూ.2500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. ప్రస్తుత తీరు చూస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.