Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది

Telugu compulsory in Telangana schools(CMO)

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఇకపై 1 నుంచి 10 వరకు అన్ని సిలబ్‌సల స్కూళ్లలో తెలుగును (Telugu Language)ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. అలాగే విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది. విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్య లు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది.

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ 

9, 10 తరగతుల పాఠ్యాంశంగా వెన్నెల అనే తెలుగు వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది(SSC Board). దీని వినియోగానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది.

Telugu compulsory in Telangana schools

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement