
Delhi, Feb 26: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు(CM Revanth Reddy). ఉదయం 10:30 గంటలకు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రధానితో చర్చించనున్నారు రేవంత్(Revanth Reddy To meet PM Modi).
అలాగే కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు రేవంత్. ఇక మహా శివరాత్రి వేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
ఇక ప్రధానితో భేటీ సందర్భంగా ప్రధానంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై(BC Reservations) చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశంపై చట్టం చేయడానికి ముందే ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని అభ్యర్థించనున్నారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం పెద్ధలతో భేటీ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది.