Hyderabad: గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ.. తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు, దొంగ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో

హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను(Thief Bathula Prabhakar) అరెస్ట్ చేశారు పోలీసులు.

Thief Bathula Prabhakar Arrest After Firing on Police(video grab)

హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను(Thief Bathula Prabhakar) అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ, ఏపీలో 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్(Bathula Prabhakar). దొంగను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గచ్చిబౌలిలో పోలీసుల(Firing on police)పై దొంగ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ప్రిజం పబ్‌ దగ్గర తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికు, ఓ బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. దొంగను పోలీసులు పట్టుకోగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి.. ట్రాక్టర్‌తో కార్లు ధ్వంసం చేసిన యువకుడు 

Thief Bathula Prabhakar Arrest After Firing on Police

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement