Uttam Kumar Reddy Covid: ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్, ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు స్కానింగ్‌లో నిర్థారణ
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.
స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ప్రమాదంలో పడతారని శుక్రవారమే ఉత్తమ్ అన్నారు. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని తెలుపుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆయన లేఖ కూడా రాశారు.
Here's Uttam Kumar Reddy Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)