Traffic Restrictions in Hyderabad: వినాయక నవరాత్రుల నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad, Sep 7: వినాయక చవితి, గణనాథుడి నవరాత్రి ఉత్సవాలకు (Ganesh Festival) హైదరాబాద్ నగరం సర్వాంగరంగంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఖైరతాబాద్ లో బడా గణేష్ తోపాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)