Khairatabad Big Ganesh Darshan (Credits: X)

Hyderabad, Sep 7: తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు. నేడు చవితి. ఈ ఉదయం నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖశక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న గణేష్‌ ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నేటి ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలిపూజ లో పాల్గొననున్నారు. సాయంత్రం 3 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. 1954లో ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం ప్రారంభమైంది. గణపతి ప్రతిష్టించడం ఈ ఏడాదికి 70 ఏండ్లు. దీన్ని పురస్కరించుకొని  70 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్యావరణ హితమైన మట్టి గణపతిని నిర్వాహకులు తీర్చిదిద్దారు.

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్‌ లో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజ్‌ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!

Here's Video

బందోబస్తుకు 400 మంది పోలీసులు

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకునేందుకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, నిమజ్జనంనాటికి రెండు సార్లు వీకెండ్ రావడం వెరసి పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌లు పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్‌పీలు, 13 మంది ఇన్‌ స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది సహా మొత్తం 400 మంది పోలీసులు పనిచేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.

హీరో రాజ్ తరుణ్‌ నిందితుడే, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, పదేళ్ల పాటు సహజీవనం చేశారని కామెంట్