Young Man Dies of Heart Attack: వీడియో ఇదిగో.. జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో కుప్పకూలి 30 ఏళ్ల యువకుడు మృతి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జ్యూస్ సెంటర్‌లో జ్యూస్ తాగుతున్న 30 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతూ ప్రజల్లో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది వ్యక్తులు గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జ్యూస్ సెంటర్‌లో జ్యూస్ తాగుతున్న 30 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన ఏకలవ్య (30) ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మిత్రుడితో కలిసి ఉన్నాడు. బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి జ్యూస్ తాగడానికి అక్కడి జ్యూస్ సెంటర్‌కి వెళ్లాడు. నిల్చొని తాగుతున్న కొద్దీ, ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆయనను గమనించి సిపిఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, పోలీస్ వాహనంలోనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు నిర్ధారించినప్పటి వరకు ఏకలవ్య ప్రాణాలు కోల్పోయాడు. 30 ఏళ్ల యువకుడి గుండెపోటు మరణం స్థానికులలో తీవ్ర దిగ్భ్రాంతి, విషాదాన్ని కలిగించింది. వైద్యులు, అధికారులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇబ్రహీంపట్నం మార్చురికి తరలించారు.
30-Year-Old Man Dies of Heart Attack While Drinking Juice
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)