Accident at Kondagattu: కొండగట్టులో రెండు లారీలు ఢీ.. ముగ్గురికి గాయాలు.. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటమే కారణం (వీడియో)

ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా అందులో రాజస్థాన్ నుండి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ దేవిలాల్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.

Accident at Kondagattu (Credits: X)

Kondagattu, Nov 22: కరీంనగర్-జగిత్యాల రహదారి కొండగట్టు (Kondagattu) వద్ద రెండు లారీలు (Trucks) ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.  ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా అందులో రాజస్థాన్ నుండి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ దేవిలాల్ లారీ క్యాబిన్ లో  ఇరుక్కుపోయాడు. దీంతో  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. జేసీబీ సాయంతో అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)